ఒమన్ లో OMR11.01బియలన్ల రాబడి లక్ష్యం!

- January 02, 2024 , by Maagulf
ఒమన్ లో OMR11.01బియలన్ల రాబడి లక్ష్యం!

మస్కట్: 2024 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర సాధారణ బడ్జెట్ మొత్తం అంచనా ఆదాయం OMR11.010 బిలియన్లుగా పేర్కొన్నారు. ఇది 2023 కోసం అంచనా వేసిన ఆదాయాలతో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను కలిగి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఒమన్ 2024 బడ్జెట్ కోసం అంచనా వేసిన ఆదాయాలు బ్యారెల్‌కు $60 చమురు ధర ఆధారంగా లెక్కించినట్లు తెలిపింది.  రాష్ట్ర సాధారణ బడ్జెట్ 2024 కోసం మొత్తం ప్రజా వ్యయం OMR11.650 బిలియన్లుగా అంచనా వేశారు.  ఇది 2023లో అంచనా వేయబడిన ప్రభుత్వ వ్యయం కంటే 2.6 శాతం అధికం.  బడ్జెట్ లోటు సుమారుగా OMR640 మిలియన్లుగా అంచనా వేశారు.  ఇది మొత్తం రాబడిలో 6 శాతం మరియు స్థూల దేశీయోత్పత్తి (GDP)లో 1.5 శాతం గా పేర్కొన్నట్లు ఆర్థిక మంత్రి సుల్తాన్ సలీమ్ అల్ హబ్సీ వివరించారు. 2024 రాష్ట్ర బడ్జెట్ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం, ఆర్థిక అభివృద్ధిలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని, సామాజిక పరిరక్షణ నిధి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమాలకు గొడుగుగా కావలసిన పాత్రను పోషించేలా చేయడం ద్వారా సామాజిక అంశానికి మద్దతు ఇస్తుందన్నారు. పౌరులకు బీమా కవరేజ్, సామాజిక రక్షణ స్థాయిని అప్‌గ్రేడ్ చేయడంతోపాటు విద్య, ఆరోగ్యం మరియు గృహవసతి వంటి ప్రాథమిక సేవలలో ఖర్చు స్థాయిని నిర్వహించడం ప్రాధాన్య అంశాలుగా పేర్కొన్నారు.  2024 బడ్జెట్‌లో చమురు ఆదాయాలు మొత్తం రాబడిలో 54 శాతం ఉండగా, గ్యాస్ రంగం సహకారం 14 శాతం,  చమురుయేతర ఆదాయాలు మొత్తం ప్రజా ఆదాయంలో 32 శాతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com