అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం..
- January 03, 2024
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 14మంది మరణించారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ సమీపంలోని బలిజన్ గ్రామంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. వారు తెల్లవారుజామున 3గంటల సమయంలో అథ్ఖెలియా నుంచి విహార యాత్రకోసం తిన్సుకియాలోని తిలింగ ఆలయానికి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు.
తెల్లవారు జామున 5గంటల సమయంలో మార్గరీటా నుంచి బొగ్గులోడుతో వస్తున్న ట్రక్కు, బస్సు బలంగా ఢీకున్నాయి. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారు ఇరుక్కుపోయారు. వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







