వెంకటేష్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ రెడీ.!
- January 03, 2024
విక్టరీ వెంకటేష్ తాజా మూవీ ‘సైంధవ్’ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా స్టోరీ పలానా అంటూ గతంలోనే కొన్ని పుకార్లు షికార్లు చేశాయ్.
ట్రైలర్ చూస్తుంటే, ఆ పుకార్లు నిజమే అనిపించేలా వున్నాయ్. కానీ, వెంకటేష్ ఏజ్‌కి తగ్గ క్యారెక్టరూ, చెప్పిన డైలాగులూ, కటౌట్‌కి తగ్గ ఫైట్లూ.. తండ్రీ, కూతురు సెంటిమెంటూ.. ఇలా అనేక రకాల యాంగిల్స్ ‘సైంధవ్’పై అంచనాలు పెంచేలా వున్నాయ్.
సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇదే రేస్‌లో చాలా సినిమాలున్న సంగతి తెలిసిందే. ఇది మా సినిమా శాంపిల్.. అని విక్టరీ వెంకటేష్ అందరి కన్నా ముందే తన సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌కి మంచి ట్రీటే ఇచ్చేశాడు.
ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సంక్రాంతి రేస్‌లో విక్టరీ వెంకటేష్‌ని విక్టరీ వరించడం ఖాయమే అనిపిస్తోంది. అన్నట్లు ఈ సినిమాకి ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించగా, శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్‌గా నటించింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ పాత్ర పోషించాడు.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







