సుడిగాలి సుధీర్ కాస్త కొత్తగా ట్రై చేశాడే.!
- January 03, 2024
‘గాలోడు’ సినిమాతో బుల్లితెర కమెడియన్‌గా వున్న సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. చిన్న సినిమానే అయినా ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ని బాగానే అలరించింది. దాంతో మనోడి సుడి తిరిగేసింది. కోటి రూపాయల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి చేరుకున్నాడు.
తాజాగా ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమాలో నటించాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమా ధియేటర్లలో అలా వచ్చి ఇలా పోయిందనుకోండి. ఎప్పుడొచ్చిందో కూడా తెలీదు. కానీ, ఓటీటీలో ప్రస్తుతం సందడి చేస్తోంది.
సుధీర్ అంటే కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్. కానీ, సీరియస్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తనకు అస్సలు సంబంధం లేని జోనర్‌లో నటించాడు సుధీర్. ఓకే.! తన వరకూ తాను బాగానే నటించాడు.
కానీ, అక్కడక్కడా కాస్త బిగుసుకుపోయినట్లుగా అనిపించింది సుధీర్ నటన. యాక్షన్ సీన్లలోనూ కాస్త అతి చేసినట్లుగా అనిపించింది. ఓవరాల్‌గా ‘కాలింగ్ సహస్ర’ ఓటీటీ వరకూ జస్ట్ ఓకే అనదగ్గ మూవీనే.
ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు సెట్స్‌పై వున్నాయ్ సుధీర్‌కి. ఒక్కొక్కటిగా అవి పూర్తి చేసి వదిలేందుకు సిద్ధంగా వున్నాడు. అయితే, తనకు బాగా కొట్టిన పిండి అయిన కామెడీ జోనర్ కూడా టచ్ చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం. మరి, మనోడేమో ప్రయోగాలనే బాటలో నడిచేలా వున్నాడు చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







