నా సామిరంగా.! ఇప్పుడైనా ఆ యంగ్ హీరో కెరీర్ టర్న్ అవుతుందా.?
- January 04, 2024
ఒకప్పుడు ఆ హీరో ఓ సెన్సేషన్. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ కొట్టి.. అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. జూనియర్ మాస్ రాజా అంటూ అప్పట్లో ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకున్నారు కూడా ఆ హీరోని.
ఆయన ఎవరో మీకిప్పటికే అర్ధమైపోయి వుంటుంది. ఆయన మరెవరో కాదు, రాజ్ తరుణ్. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమై, ఆ తర్వాత వరుస హిట్లు కొట్టి, క్రేజీ హీరో అనిపించుకున్నాడు.
అయితే, ఆ యోగం ఎంతో కాలం నిలవలేదు రాజ్ తరుణ్‌కి. డబుల్ హ్యాట్రిక్ తర్వాత వరుసగా పరాజయాలు వెంటాడాయ్. దాంతో, అడ్రస్ గల్లంతైపోయింది. ఏ సినిమా చేసినా కలిసి రాలేదు.
ఇక లేటెస్ట్‌గా మనసు మార్చుకున్న రాజ్ తరుణ్, నాగార్జునతో ‘నా సామిరంగా’ సినిమాలో నటించడానికి సిద్ధపడ్డాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారని అంటున్నారు.
అలాగే, రాజ్ తరుణ్‌తో పాటూ, అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు నాగార్జున, మరోవైపు అల్లరి నరేష్.. ఈ ఇద్దరి మధ్యా మన యంగ్ హీరో నలిగిపోతాడో.. లేదంటే మంచి టర్నింగ్ తీసుకుంటాడో తెలియాలంటే, ఈ నెల 13 వరకూ వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







