కువైట్ ప్రధానిగా షేక్ డాక్టర్ మొహమ్మద్ సబా అల్-సబా నియామకం

- January 05, 2024 , by Maagulf
కువైట్ ప్రధానిగా షేక్ డాక్టర్ మొహమ్మద్ సబా అల్-సబా నియామకం

కువైట్: అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ గురువారం షేక్ డాక్టర్ మొహమ్మద్ సబా అల్-సలేమ్‌ను ప్రధానమంత్రిగా నియమిస్తూ అమీరీ ఉత్తర్వుపై సంతకం చేశారు.  1955లో జన్మించిన షేక్ డా. మహ్మద్ క్లారెమాంట్ గ్రాడ్యుయేట్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డిని పొందారు. 1985లో కువైట్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అతను 1987-88లో కువైట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో పనిచేశాడు. షేక్ డాక్టర్ మహ్మద్ 1993లో అమెరికాలో రాయబారిగా పనిచేశారు. ఫిబ్రవరి 14, 2001న విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.  జూలై 14, 2003న విదేశీ వ్యవహారాల మంత్రిగా మరియు సామాజిక వ్యవహారాలు మరియు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 9, 2006న, షేక్ డాక్టర్ మొహమ్మద్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. అతను జూలై 2006 మరియు మార్చి 2007లో అదే పదవిలో కొనసాగారు. అలాగే అక్టోబరు 2007 మరియు మే 2008లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కూడా అదే బాధ్యతలను చేపట్టారు. 2009 మే 29, 2011 మే 8న ఏర్పాటైన ప్రభుత్వంలోనూ పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com