నిర్మాతగా మారనున్న వెంకటేష్.!
- January 05, 2024
టాలీవుడ్ నిర్మాతల్లో అగ్ర నిర్మాత అయిన దివంగత రామానాయుడుకి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా చాలా అభిమానం. అంతులేని ఇష్టం. ముద్దుగా ‘రాజా’ అని పిలుచుకునేవారు చిరంజీవిని ఆయన.
కానీ, వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా తెరకెక్కకపోవడం విశేషం. రామానాయుడు చివరి రోజుల్లో కూడా ఎలాగైనా చిరంజీవితో సినిమా తీయాలన్న తన మనసులోని కోరికని బయట పెట్టారు. కానీ, ఆ కోరిక తీరకుండానే చనిపోయారాయన.
అందుకే తండ్రి కోరికను తీర్చేందుకు తనయుడు వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందించాలని అనుకుంటున్నారట వెంకటేష్. ఆ సినిమాలో చిరుతో పాటూ వెంకటేష్ కూడా నటించబోతున్నారట.
ఈ సినిమాకి వెంకటేష్‌తో పాటూ, చిరంజీవి కూడా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోనున్నారనీ ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గా ‘సైంధవ్’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరైన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమం సందర్భంగానే వెంకటేష్.. చిరంజీవితో కలిసి సినిమా చేయాలని వుందన్న తన కోరికను బయట పెట్టారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే, వెంకీ కోరికతో పాటూ, తండ్రి రామానాయుడి కోరిక కూడా ఈ విధంగా తీరిపోనుందన్న మాట. అయితే, ఈ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయగల దర్శకుడు ఎవరో ప్రస్తుతానికి సస్పెన్సే.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







