రేస్లోంచి తప్పుకున్న మాస్ రాజా.!
- January 05, 2024
సంక్రాంతి రేస్లో ఈ సారి ఐదు సినిమాలు పోటీలో వున్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోలు మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వున్నారు. వారితో పాటూ, మాస్ రాజా రవితేజ కూడా ‘ఈగల్’ సినిమాతో సిద్ధమయ్యారు. అయితే, నిర్మాతల మండలి చర్చోపచర్చల తర్వాత మాస్ రాజా వెనక్కి తగ్గిపోయారు.
‘ఈగల్’ నిర్మాత తన సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. ఫిబ్రవరి 9న సోలోగా ‘ఈగల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పెద్ద హీరోల సినిమాలున్నప్పుడు ఖచ్చితంగా ధియేటర్ల సమస్య తలెత్తుతుంది. ఆ యాంగిల్లోనే ముగ్గురు పెద్ద హీరోలకూ ధియేటర్ల పంపకం జరిగింది. దాంతో, రవితేజ సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు.
ఈ మధ్య అసలే మాస్ రాజా సినిమాలకు సరైన ఓపెనింగ్సే రావడం లేదు. అలాంటిది, ఇంత పోటీ మధ్య రావడం సబబు కాదనుకున్నారో ఏమో.! తమంతట తాముగా రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది.
‘మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్కు కాదు.. ఇండస్ర్టీ బాగు కోసం.. ఓ మంచి సినిమాని జనాలకి ఎక్కువ ధియేటర్లలో అందుబాటులో వుంచడం కోసమే ఈ మార్పు..’ అని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా సినిమా వాయిదాని ‘ఈగల్’ నిర్మాత ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







