ఒమన్ ఫ్రీజ్: ఈ స్టేషన్‌లో సబ్-జీరో ఉష్ణోగ్రత నమోదు

- January 09, 2024 , by Maagulf
ఒమన్ ఫ్రీజ్: ఈ స్టేషన్‌లో సబ్-జీరో ఉష్ణోగ్రత నమోదు

మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని జబల్ షామ్స్ స్టేషన్‌లో జనవరి 7న( ఆదివారం) సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత - 1.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఒమన్ వాతావరణ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో వాతావరణ స్టేషన్లలో జబల్ షామ్స్ అత్యల్ప ఉష్ణోగ్రత -1.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆ తరువాత అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సైక్ స్టేషన్ 5.4 డిగ్రీల సెల్సియస్‌.. ధోఫర్ గవర్నరేట్‌లోని ముఖిన్ స్టేషన్ 10.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ధోఫర్ గవర్నరేట్‌లోని మజ్యోనా స్టేషన్‌లో 10. 7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తుమ్రైట్‌లో 5.11 డిగ్రీల సెల్సియస్, మార్ముల్‌లో 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com