గల్ఫ్ వ్యాపారవేత్తకు చుక్కెదురు.. BD5 మిలియన్లు చెల్లించాలని తీర్పు
- January 09, 2024
బహ్రెయిన్: కాంట్రాక్టు కంపెనీ తరపున చేసిన పనికి నిర్మాణ సంస్థకు BD5 మిలియన్లకు పైగా చెల్లించాలని ఒక గల్ఫ్ వ్యాపారవేత్తను బహ్రెయిన్ హై సివిల్ కోర్టు ఆదేశించింది. రెండు పక్షాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. నిర్మాణ సంస్థ క్లెయిమ్ చేసిన మొత్తానికి వ్యాపారవేత్త బాధ్యుడని కోర్టు నిర్ధారించింది. తన క్లయింట్ ఒప్పందంలో పేర్కొన్న అన్ని పనులు, నిర్మాణ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, వాటిని ప్రతివాదికి అప్పగించినట్లు కాంట్రాక్టు కంపెనీ తరపున వాదించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. సదరు వ్యాపారవేత్త కొన్ని ఆస్తులను విక్రయించి.. మిగిలిన వాటిలో పెట్టుబడి పెట్టాడని, నిర్మాణం, భవన నిర్మాణ పనులకు అయిన మొత్తం ఖర్చుల బకాయి చెల్లించడంలో విఫలమయ్యాడని పేర్కొన్నాడు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. నివేదిక ఇవ్వాలని అకౌంటింగ్ నిపుణుడిని నియమించింది. దాదాపుగా BD5 మిలియన్ కంటే ఎక్కువ మొత్తాన్ని వ్యాపారవేత్త ఇంకా చెల్లించాల్సి ఉందని నిపుణుడు తన నివేదికను కోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







