టికెట్ రేట్లను అప్‌డేట్ చేసిన దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో
- January 09, 2024
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్ టికెట్ రేట్లను అప్‌డేట్ చేసింది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా కాస్త ఎక్కువ ‘లెగ్ రూమ్’ ఉండే ముందు వరుస సీట్ల బుకింగ్‌పై రూ.2000 ఫిక్స్‌డ్ ఛార్జీ నిర్ణయించింది. ఇక విండో సీటు బుకింగ్‌పై రూ.2000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో వెబ్‌సైట్ పేర్కొంది. 222 సీట్లు ఉండే ఏ321 విమానం ముందు వరుసలో విండో సీటు బుకింగ్ పై రూ.2000, నడక దారి సీటు బుకింగ్‌పై రూ.1500, అదే వరుసలోని రెండవ, మూడవ సీట్ల బుకింగ్ పై రూ.400 ఛార్జీలు ఉంటాయని తెలిపింది. 232 సీట్లు ఉన్న ఏ321 ఫ్లైట్, 180 సీట్లు ఉన్న ఏ320 ఫ్లైట్‌కు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది.
ప్రయాణికులు ఒకవేళ ప్రాధాన్య సీటు అవసరం లేదనుకుంటే అదనపు ఛార్జీలు లేని సీటును ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో చెక్-ఇన్ సమయంలో సీటును కేటాయిస్తారని ఇండిగో వెబ్‌సైట్ పేర్కొంది. కాగా ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. దేశీయ విమానయానరంగంలో 60 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..