అహ్మదాబాద్‌లో యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోదీ రోడ్‌షో

- January 09, 2024 , by Maagulf
అహ్మదాబాద్‌లో యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోదీ రోడ్‌షో

న్యూఢిల్లీ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్ వరకు గ్రాండ్ రోడ్‌షో నిర్వహించారు. అంతకుముందు విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడికి ప్రధాని స్వాగతం పలికారు. ఆ తర్వాత 3 కిలోమీటర్ల మేర మెగా రోడ్‌షో నిర్వహించారు. "10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌కు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ లో వెల్లడించింది.   బుధవారం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ (వీజీజీఎస్) 10వ ఎడిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. బుధవారం సమ్మిట్‌ను ప్రారంభించిన తర్వాత.. ప్రధాన గ్లోబల్ కార్పొరేషన్ల సీఈఓలతో మోదీ సమావేశం అవుతారు. ఆపై గిఫ్ట్ సిటీకి వెళతారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రధాని గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలతో ఇంటరాక్ట్ అవుతారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ జనవరి 10 నుండి 12 వరకు గాంధీనగర్‌లో జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com