జీసీసీ జీడీపీ వృద్ధిపై ప్రపంచ బ్యాంక్ కీలక నివేదిక!

- January 11, 2024 , by Maagulf
జీసీసీ జీడీపీ వృద్ధిపై ప్రపంచ బ్యాంక్ కీలక నివేదిక!

యూఏఈ: ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ..సౌదీ అరేబియా, యూఏఈ 2024లో గల్ఫ్‌లో GDP వృద్ధికి నాయకత్వం వహిస్తాయి. వచ్చే ఏడాది 3 యూఏఈ GDP 3.7 శాతం పెరుగుతుంది. ఇదిలా ఉండగా.. గ్లోబల్ బ్యాంకింగ్ గ్రూప్ సౌదీ అరేబియా ఈ ఏడాది 4.1 శాతం వృద్ధి సాధిస్తుందని, వచ్చే ఏడాది 4.2 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

యూఏఈ GDP 2023లో 3.4 శాతానికి పెరుగుతుందని, 2024లో 3.7 శాతానికి మరియు 2025లో 3.8 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారం.. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాలలో వృద్ధి 2024లో 3.6 శాతానికి, 2025లో 3.8 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.  మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (మెనా) ప్రాంతంలో చమురు ఉత్పత్తి కోతలు, పెరిగిన ద్రవ్యోల్బణం మరియు చమురు-దిగుమతిలో బలహీనమైన ప్రైవేట్ రంగ కార్యకలాపాలు వంటి పలు ఎదురుగాలిలను ఎదుర్కొన్నందున 2023లో వృద్ధి రేటు 1.9 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. 2024 మరియు 2025లో మెనా ప్రాంతంలో వృద్ధి రేటు 3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినట్టు నివేదికలో తెలిపారు.   

నివేదికలో ముఖ్యంశాలు:
సౌదీ అరేబియా ఈ ఏడాది 4.1 శాతం వృద్ధి చెందుతుందని, వచ్చే ఏడాది 4.2 శాతానికి పెరుగుతుందని అంచనా. యూఏఈ GDP ఈ సంవత్సరం 3.7 శాతం వృద్ధి చెందుతుంది. వచ్చే ఏడాది 3.8 శాతం వేగవంతం అవుతుంది. బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2024లో 3.3 శాతం, 2025లో 3.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. ఒమన్ జిడిపి 2024లో 2.7 శాతం మరియు 2025లో 2.9 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. కువైట్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది చివరి నాటికి 2.6 శాతం వృద్ధి చెందుతుందని, వచ్చే ఏడాది 2.7 శాతానికి పెరుగుతుందని అంచనా. ఖతార్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.5 శాతం వృద్ధి చెందుతుందని, వచ్చే ఏడాది 3.1 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com