మైక్రోసాఫ్ట్‌ అధినేత నేడు ప్రధానమంత్రి మోదీతో భేటీ ..

- May 30, 2016 , by Maagulf
మైక్రోసాఫ్ట్‌ అధినేత  నేడు ప్రధానమంత్రి మోదీతో భేటీ ..

 భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్య నాదెళ్ల నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐటీ రంగం, పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో కూడా నాదెళ్ల సమావేశమయ్యారు.
మైక్రోసాఫ్ట్‌ నిర్వహించిన 'టెక్‌ ఫర్‌ గుడ్‌, ఐడియాస్‌ ఫర్‌ భారత్‌' కార్యక్రమం కోసం సత్య నాదెళ్ల నేడు దిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. క్లౌడ్‌ టెక్నాలజీ, మొబైల్‌ వినియోగం ఆవశ్యకతను గురించి వివరించారు. 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెళ్ల భారత్‌కు రావడం ఇది మూడోసారి. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది నవంబర్‌లో ఆయన తొలిసారిగా భారత్‌కు వచ్చారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్‌లో ముంబయికి వచ్చిన ఆయన హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌ను కూడా సందర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com