అటల్ సేతు బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 12, 2024
ముంబై: ముంబైలో సముద్రంపై నిర్మించిన దేశంలోని అతిపెద్ద బ్రిడ్జ్‌ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్‌ను అటల్ సేతు(Atal Setu)గా పిలువనున్నారు.
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా దీన్ని పిలుస్తున్నారు. ఈ బ్రిడ్జ్ సుమారు 21.8 కిలోమీటర్ల పొడుగు ఉంది. బ్రిడ్జ్ పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్‌పేయి సేవారి-నహవా సేవా అటల్ సేతు. సుమారు 17,840 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. దాదాపు రెండున్నర గంటల జర్నీని కేవలం 20 నిమిషాలకు కుదిస్తోంది.
భారత్‌లోనే అతిపొడువైన బ్రిడ్జ్‌గా దీన్ని గుర్తిస్తున్నారు. ఇక దేశంలో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జ్ కూడా ఇదే కానున్నది. డిసెంబర్ 2016లో ప్రధాని మోదీనే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుశస్థాపన చేశారు. ముంబై పోర్టు నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్టు మధ్య దూరాన్ని కూడా తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







