యూఏఈ జాతీయ లాటరీ లైసెన్స్: మహ్జూజ్ కు లైన్ క్లియర్!
- January 13, 2024
యూఏఈ: ప్రసిద్ధ వారపు రాఫిల్ డ్రా మహ్జూజ్ లాటరీ లైసెన్స్ కోసం దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిందని, గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ నుండి అనుమతి కోసం వేచి ఉందని వీక్లీ డ్రా అధికారి శుక్రవారం తెలిపారు. మహ్జూజ్ కమ్యూనికేషన్స్ హెడ్ సుజాన్ కజ్జీ మాట్లాడుతూ.. "యూఏఈలోని ఒక రాఫిల్ డ్రా ఆపరేటర్‌కు జాతీయ లాటరీ లైసెన్స్ ఇవ్వబడుతుంది." అని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ 2023 చివరిలో మహ్జూజ్ మరియు ఎమిరేట్స్ డ్రాతో సహా యూఏఈలో జరిగే వారపు రాఫిల్ డ్రాలు సెప్టెంబర్ 2023లో ఏర్పడిన జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) ద్వారా తమ కార్యకలాపాలను పాజ్ చేయమని ఆదేశించింది. ‘‘మేము మా దరఖాస్తును సమర్పించాము. మా ట్రాక్ రికార్డ్ మరియు విజేతల సంఖ్య, చెల్లింపులు లైసెన్స్ పొందడంలో మాకు సహాయపడతాయని మేము నమ్ముతున్నాము" అని కజ్జీ వివరించారు. తాము జనవరి 1 నుంచి తమ అమ్మకాలను నిలిపివేసామన్నారు. గత మూడు సంవత్సరాలుగా 66 మంది మిలియనీర్లను సృష్టించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ నుండి 2 మిలియన్ కంటే ఎక్కువ మంది విజేతలుగా నిలిచారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..