కార్మికులకు శాపంగా చీప్ ఫుడ్
- May 30, 2016
దుబాయ్‌లో కార్మికులు, తక్కువ ధరకే లభించే ఆహారం పట్ల ఆసక్తి చూపుతుండడం వారి ఆరోగ్యానికి తీవ్ర హానికరంగా మారుతోందని దుబాయ్ మునిసిపాలిటీ వర్గాలు చెప్పాయి. తాజా తనిఖీల్లో 35 టన్నుల 'తినడానికి పనికిరాని ఆహారాన్ని' మునిసిపాలిటీ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ పోలీస్ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ సహకారంతో దుబాయ్ మునిసిపాలిటీ ఈ తనిఖీల్ని నిర్వహించింది. కార్మికులు శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడంలో వారి ఆర్థిక స్థితిగతులు సహకరించడంలేదనీ, వారి ఇబ్బందుల్ని క్యాష్ చేసుకోడానికి కొందరు వారికి దగ్గరగానే తక్కువ ధరలో ఆహార విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమనీ, ప్రజారోగ్యానికి హానికరమని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ మార్వాన్ అల్ మొహమ్మద్ చెప్పారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ పలు సందర్భాల్లో నిర్వహించినట్లు వివరించాచారయన. 2016 ప్రారంభం నుంచి దుబాయ్ మునిసిపాలిటీ 23 తనిఖీల్ని నిర్వహించి, ఇల్లీగల్ మార్కెట్‌ని అడ్డుకుంటోంది. పాడైపోయిన మాంసం, ఫిష్ మరియు కూరగాయలు ఈ తక్కువ ధర ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







