ఇండియాకు వెళ్లే వందలాది విమానాలు రద్దు
- January 18, 2024
యూఏఈ: ఇండియాలో ఉన్న ప్రతికూల వాతావరణం కారణంగా అనేక విమానాలు రద్దవుతున్నాయి. దీంతో ఇండియాకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోపాల్‌లోని తన అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసేందుకు న్యూఢిల్లీకి ప్లైట్ బుక్ చేసుకుంటే అది చివరి క్షణంలో రద్దయిందని, దాంతో ముంబైకి వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంటే అది కూడా రెండు గంటల ఆలస్యం అయిందని సాదియా అన్వర్ తెలిపారు. స్మార్ట్ ట్రావెల్స్ జనరల్ మేనేజర్ సఫీర్ మహమూద్ మాట్లాడుతూ.. “గత రెండు రోజుల్లో భారతదేశానికి వెళ్లే 150కి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి లేదా ఆలస్యం అయ్యాయి. న్యూఢిల్లీ విమానాశ్రయం వద్ద అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దాంతో దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలను ప్రభావితం చేసింది.’’ అని వివరించారు. రతదేశంలోని కొన్ని నగరాలు ముఖ్యంగా న్యూ ఢిల్లీ పరిసరాల్లో పొగమంచు అధికంగా ఉందన్నారు. ఇది విమాన రాకపోకలను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు. విమానాలు రద్దువుతుండటంతో కొంత మంది ప్రయాణికులు తమ ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం విమానం 10 గంటలు ఆలస్యం అయిన నేపథ్యంలో పైలట్‌ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ట్వీట్ చేశారు. ప్రయాణీకుల సమస్యలను పరిష్కరించడానికి ఆరు విమానాశ్రయాలలో వార్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







