ఎస్సీ వర్గీకరణ పై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు
- January 19, 2024
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పై ముందడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను ఈ కమిటీకి సభ్యులుగా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇక జనవరి 23వ తేదీన ఈ కమిటీ తొలిసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తూ.. మోడీ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







