నేడు ఒకే వేదిక పై యన్.టి.ఆర్ 28వ పుణ్యతిధి,ఎ.ఎన్.ఆర్ శతజయంతి

- January 19, 2024 , by Maagulf
నేడు ఒకే వేదిక పై యన్.టి.ఆర్ 28వ పుణ్యతిధి,ఎ.ఎన్.ఆర్ శతజయంతి

విశాఖపట్నం: లోక్ నాయక్ పౌండేషన్ నేతృత్వంలో విశాఖ వేదికగా యన్.టి.ఆర్ 28వ పుణ్య తిధి, ఎ.ఎన్.ఆర్ శతజయంతి వేడుకలు శనివారం వైభవంగా జరగనున్నాయని సంస్ధ వ్యవస్దాపకులు పద్మభూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానుండగా. మధురవాడ వి.కన్వేన్షన్ లో ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. సభా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి అధ్యక్షత వహించనుండగా, గౌరవ అతిధులుగా కేంద్ర హోం శాఖ పూర్వకార్యదర్శి పద్మనాభయ్య, నరసరావు పేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, అత్మీయ అతిధిగా స్దానిక శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు వ్యవహరించనున్నారని యార్లగడ్డ వివరించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ గత 19 సంవత్సరాలుగా దివంగత నందమూరి తారక రామారావు పుణ్యతిధి రోజున అందిస్తున్న పురస్కారాల ప్రధానంలో భాగంగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ కు రెండు లక్షల నగదుతో సాహిత్య పురస్కారం అందిస్తామన్నారు. 

బెంగుళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షులు రాధాకృష్ణం రాజు, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, కవి విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లి లకు ఒక్కొక్కరికీ రూ.50వేల నగదుతో లోక్ నాయక్ పౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాలు అందించనున్నామన్నారు. మాలతీ చందూర్ దంపుతులు, బోయి భీమన్న,  వాసిరెడ్డి సీతా దేవి, కాళీపట్నం రామారావు, రావూరి భరధ్వాజ, అవత్సం సోమసుందరం, సుబ్బన్న శతావధాని, వంగూరి చిట్టేన్ రాజు, హనుమత్ శాస్త్రి, గరగపాటి నరసింహారావు, ఓల్గా, గొల్లపూడి మారుతీరావు, గోరేటి వెంకన్న, మీగడ రామలింగ స్వామి, అంపశయ్య నవీన్, ఎమెస్కో విజయకుమార్, కత్తి పద్మారావు, తణికెళ్ల భరణి, వేమూరి బలరాం లకు లోక్ నాయక్ ఫౌండేషన్ గతంలో సాహిత్య పురస్కారాలు అందించిందని అచార్య యార్లగడ్డ పేర్కోన్నారు. జీవన సాఫల్య పరస్కారం సుంకవల్లి రాజ్య లక్ష్మి, డేనియల్ నిగర్స్, వీరెళ్ల రాజేశ్వరరావు, చివుకుల ఉపేంద్ర, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, లావు రత్తయ్య, కూచిబొట్ల ఆనంద్, కోనేరు సత్యన్నారాయణ, డాక్టర్ గన్ని  భాస్కరరావులకు అందచేసామన్నారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఆహ్వానితులకు మాత్రమే అవకాశం ఉందని, ప్రాంగణ ప్రవేశానికి ఆహ్వాన పత్రం తప్పనిసరని అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ స్పష్టం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com