‘హనుమాన్.! చిరంజీవి ఎందుకు వద్దన్నాడంటే.!
- January 20, 2024
ప్రశాంత్ వర్మ.. రెండు చిన్న సినిమాలు తీసిన ఓ చిన్న డైరెక్టర్. తేజ సజ్జా కూడా అంతే.! హీరోగా రెండు సినిమాలు చేసిన అనుభవం మాత్రమే వుంది.
ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే తాజా సినిమా ‘హనుమాన్’. ఇది కూడా చిన్న సినిమానే. కానీ.. పెద్ద హిట్టు సినిమా. విడుదలై వారం రోజులైంది. అయినా హౌస్ ఫుల్స్. ఎక్కడా తగ్గేదే లే.! అంటున్నారు ‘హనుమాన్’ చూసేందుకు ప్రేక్షకులు.
ఈ సంగతిలా వుంటే.. ఈ సినిమా చివరి 10 నిముషాల్లో కనిపించే హనుమంతుడి పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని చేయమని అడిగారట. సినిమా చూసిన తర్వాత చిరంజీవి ఒప్పుకోలేదట.
సినిమా చాలా బాగా వచ్చింది. మీరు పడిన కష్టానికి నా తరపు నుంచి ఏ సాయమైనా చేస్తాను. ఎంత సపోర్ట్ అయినా ఇస్తాను. కానీ, సినిమాలో నేను నటించను. మీ కష్టానికి తగ్గ ఫలితం మీకే దక్కాలి.
నేను నటిస్తే.. సినిమాకి వున్న హైప్ వేరే లెవల్ అయిపోతుంది.. అలా కావడం నాకిష్టం లేదు.. అంటూ ఇంత లో బడ్జెట్‌లో ఆ స్థాయిలో తెరకెక్కించినందుకు చిత్ర యూనిట్ మొత్తాన్నీ అభినందిస్తూ టీమ్‌ని ప్రోత్సహించారు చిరంజీవి.
చిరంజీవి చెప్పినట్లుగానే, నమ్మకం ఇచ్చినట్లుగానే సినిమా మంచి విజయం అందుకుంది. మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రశాంత్ అండ్ టీమ్ పడిన కష్టమంతా తెరపై భారీగా కనిపిస్తోంది. ‘హనుమాన్’ అనేది సినిమా కాదు.. ఓ అద్భుతం అంతే.!
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!