బాద్‌షాకి ‘జీరో’ నుంచి ‘హీరో’యిజం.!

- January 20, 2024 , by Maagulf
బాద్‌షాకి ‘జీరో’ నుంచి ‘హీరో’యిజం.!

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘జీరో’. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటించాడు. అయితే, ఈ సినిమా ఆయనను రియల్ లైఫ్‌లోనూ జీరోని చేసేసింది.

సినిమా ఫ్లాప్ అవ్వడమే కాదు.. ఆ తర్వాత ఏం చేసినా ఏదీ కలిసి రాలేదు బాద్‌షాకి. దాంతో నాలుగేళ్లు దాదాపు గ్యాప్ తీసేసుకున్నాడు.

ఈ ఏడాది బాద్‌షాకి పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. వరుస పెట్టి మూడు సినిమాల్లో నటించాడు. అవే ‘పటాన్’, ‘జవాన్’, డుంకీ’ చిత్రాలు. మూడూ మంచి హిట్స్ అందుకున్నాయ్.

ప్రపంచ వ్యాప్తంగా ‘పటాన్’, ‘జవాన్’ సినిమాలైతే రికార్డు బ్రేకింగ్ వసూళ్లు రాబట్టాయ్. ఇక, ఇదే జోరులో వచ్చే ఏడాదికి మరో మూడు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టబోతున్నాడట షారూఖ్ ఖాన్.

ఈ సారి కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, ప్యాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ ప్రాజెక్టులు సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాడట.

ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న షారూఖ్ ఖాన్.. తదుపరి ప్రాజెక్టులు త్వరలోనే అనౌన్స్ చేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా మరో మూడింటిని లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడనీ సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com