అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్..50 మంది మృతి..

- January 20, 2024 , by Maagulf
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్..50 మంది మృతి..

అమెరికా: అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. గత వారం రోజులుగా ఎడతెగని తుఫానులు యునైటెడ్ స్టేట్స్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మంచు తుఫాన్ తో రోడ్లపై మంచు పేరుకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మంచు తుఫాన్ కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో 50 మందికి పైగా మరణించినట్లు చెప్పారు. శీతల గాలులు, తగ్గిన ఉష్ణోగ్రతలు, దట్టమైన మంచు కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులపై మంచు  ఘోరమైన ప్రమాదాలకు కారణమయ్యాయి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో పలు విమానాలను రద్దు చేశారు, పాఠశాలలను మూసివేశారు.

టేనస్సీలో 14 వాతావరణ సంబంధిత మరణాలను ఆగ్నేయ రాష్ట్ర ఆరోగ్య విభాగం ధృవీకరించింది. అయితే మక్కాకు తీర్థయాత్ర చేసి ఇంటికి తిరిగి వస్తున్న ఐదుగురు మహిళలు మంగళవారం పెన్సిల్వేనియా హైవేపై ట్రాక్టర్-ట్రైలర్‌తో ప్రమాదంలో మరణించారని పోలీసులు తెలిపారు.

కెంటకీలో ఐదుగురు మరణించారని గవర్నర్ ఆండీ బెషీర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒరెగాన్‌లో, బుధవారం మంచు తుఫాను కురుస్తున్న సమయంలో విద్యుత్ లైన్ తెగి పడి ఆగి ఉన్న కారుపై పడడంతో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారని పోర్ట్‌ల్యాండ్ అగ్నిమాపక విభాగం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com