ఫిబ్రవరి 16న అబ్దాలిలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు

- January 22, 2024 , by Maagulf
ఫిబ్రవరి 16న అబ్దాలిలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 16న కువైట్‌లోని అబ్దాలీ ప్రాంతంలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. సలాహ్ ఫలాహ్ ఫహద్ ఆజ్మీ ఫామ్ (సుబియా రోడ్, బ్లాక్ 06, చిన్న జామియా దగ్గర, అబ్దాలి)లో కాన్సులర్ క్యాంప్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుంది. ఇందులో ఎంబసీ పాస్‌పోర్ట్ రెన్యూవల్, ఆన్‌లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్, పిసిసి అప్లికేషన్స్, రిలేషన్‌షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ, లేబర్ ఫిర్యాదుల నమోదు మొదలైన సేవలను అందించనున్నారు. క్యాంపు సమయంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే పంపిణీ చేయబడతాయని, అబ్దాలీ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ పౌరులు రాయబార కార్యాలయానికి రాకుండా ఈ సేవలను పొందేందుకు ఈ శిబిరం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, క్యాంప్ సైట్‌లో నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com