ఫిబ్రవరి 12 నుండి OSHRM వార్షిక కాన్ఫరెన్స్
- January 22, 2024
మస్కట్: కార్మిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఒమానీ సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (OSHRM).. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫిబ్రవరి 12 నుండి 14 వరకు తన వార్షిక సదస్సు (HR_X) ఏడవ ఎడిషన్‌ను నిర్వహించనుంది. ఈ ఎడిషన్ ను ప్రత్యేకంగా ఏఐ రిజల్యుషన్ కోసం కేటాయించారు. ఉద్యోగాల భవిష్యత్తుపై దాని ప్రభావాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చర్చించనున్నారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో కొత్త భవిష్యత్తును రూపొందించే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు OSHRM అధికారులు తెలిపారు. అదే విధంగా మానవ వనరుల రంగంలో తాజా పరిణామాలను ప్రదర్శించే వర్క్‌షాప్‌లు, డైలాగ్‌లు, ప్రెజెంటేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. బిజినెస్ డొమైన్లో తాజా అప్టేడ్ లు, వినూత్న మానవ వనరుల పద్ధతులు, వ్యూహాత్మక అభివృద్ధిలో ఉద్యోగుల ఎంగేజ్ మెంట్, వ్యాపారాన్ని ముందుకు వెళ్లడం వంటి అనేక కీలకమైన అంశాలపై కూడా ఈ సమావేశం దృష్టి సారిస్తుందని OSHRM డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డా. గాలిబ్ బిన్ సైఫ్ అల్-హోస్నీ వెల్లడించారు. మే 2014లో ఒమానీ సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (OSHRM)ను స్థాపించారు. ఒమన్‌లో మానవ వనరుల అభివృద్ధి, అభివృద్ధికి దోహదపడే మానవ వనరుల రంగంలో నిరంతర మార్పులపై ఇది దృష్టి సారిస్తుంది.
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్‌లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







