జాన్వీ కపూర్ అలా చేస్తుందా.?
- January 22, 2024
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మంచి నటి. గ్లామర్ పరంగా సోషల్ మీడియాలో ఆమె ఓ సెన్సేషన్. కానీ, ఒక్కసారి కెమెరా ముందుకెళ్లిందంటే చాలు.. ఆమెలోని మేకోవర్.. అద్భుతం,. అహో.. ఓహో అనాల్సిందే.
గ్లామర్‌కి అస్సలు చోటివ్వదు. కేవలం ఆమె పాత్ర మాత్రమే తెరపై కనిపిస్తుంది. అంతలా జాన్వీ కపూర్ ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తుంటుంది.
కానీ, తెలుగులో జాన్వీ కపూర్ పాత్ర అలా వుండబోతుందా.? అదేనండీ.! ‘దేవర’ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.
కానీ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు కేవలం గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. పర్ఫామెన్స్‌కి చాలా తక్కువ ప్రాధాన్యత వుంటుంది. అది కూడా ఎన్టీయార్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు చేయడానికేముంటుంది.?
మన డైరెక్టర్లు హీరోయిన్ల పాత్రల్ని హైలైట్ చేసేలా స్ర్కిప్టు డిజైన్ చేస్తారా.? అందుకే ‘దేవర’ సినిమాలో జాన్వీ పాత్రకీ అంత సీనూ సినిమా ఏమీ వుండదంట.. అంటూ ప్రచారం జరుగుతోంది.
కానీ, తెలుగులో జాన్వీ నటించబోతున్న తొలి సినిమా.. ఇంత వరకూ ఆమె నటించిన బాలీవుడ్ సినిమాల లిస్టు తీస్తే.. అన్నింట్లోనూ పర్‌ఫామెన్స్‌కి పెద్ద పీట కనిపిస్తుంది. ఏరి కోరి.. రాక రాక ఎంట్రీ ఇస్తున్న సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత లేకుంటే జాన్వీ ఒప్పుకుంటుందా.? తూచ్.! ఈ ప్రచారంలో నిజం వుండనే వుండదు గాక.! అని జాన్వీ అభిమానులు కొట్టి పాడేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







