200 కోట్ల క్లబ్బులోకి ‘హనుమాన్’.!
- January 22, 2024
ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్ సినిమాల్లో ఒకటి ‘హనుమాన్’. చిన్న సినిమా అయినా పెద్ద విజయం అందుకున్న సినిమా ఇది. గట్టిగా చెప్పాలంటే, ‘హనుమాన్’ని ఓ సినిమాలా కాకుండా అద్భుతంలా చూస్తున్నారు ఆడియన్స్.
అందుకు కారణం అంతకు ముందే లార్జ్ స్కేల్‌లో రిలీజైన ‘ఆది పురుష్’ నిరాశ పరచడమే. ఎంత వద్దనుకున్నా.. ‘ఆది పురుష్’ సినిమాతో ఈ సినిమాని పోల్చుకోకుండా వుండలేకపోతున్నారు ప్రేక్షక దేవుళ్లు.
ఆ సంగతి అటుంచితే.. ‘హనుమాన్’ సినిమాకి కలెక్షన్ల పంట పండుతూనే వుంది. పెద్ద సినిమాలు కూడా రేస్‌లో వున్నప్పటికీ.. ఈ సినిమాకే హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయ్.
బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ కలెక్షన్ల జోరు తగ్గనే తగ్గడం లేదు. 100 కోట్లు ఈజీగా దాటేసింది. ఇక ఇప్పుడు 200 కోట్ల క్లబ్బులోకి కూడా చేరబోతోంది. మొదటి వారంలోనే కాదు కాదు, మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ‘హనుమాన్’.
ఇక, రెండో వారంలోనూ అదే తాకిడి కొనసాగుతోంది. ఒక్కసారి కాదు.. రెండు మూడు సార్లు చూడాలన్న కుతూహలం చూపిస్తున్నారు ‘హనుమాన్’ సినిమాని. దాంతో, భీభత్సమైన కలెక్షన్లు కురుస్తున్నాయ్. చూడాలి మరి, ఈ జోరు ఎన్నాళ్లు కొనసాగనుందో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







