‘సలార్ 2’ కథ కోసం కసరత్తులు.!
- January 23, 2024
‘సలార్’ మొదటి పార్ట్‌కి ఫ్లాష్ బ్యాక్ కథే ప్రాణం. ఎంతో కొంత ఇంట్రెస్టింగ్‌గా వుందంటే.. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్టే. కథ కూడా ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఆడియన్స్‌కి అర్ధమయ్యేలా విప్పి చెప్పేశాడు ప్రశాంత్ నీల్.
రెండో పార్ట్‌లో కథ ఎలా వుండబోతుందన్న విషయాన్ని మొదటి పార్ట్ ఎండింగ్‌లోనే ఓ క్లారిటీ ఇచ్చేశాడు. కానీ, ఆ కథనాన్ని ఆసక్తికరంగా ఎలా తెరపై ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్.? అనేదే ఇక్కడ ఆసక్తి గొలిపే అంశం.
అందుకే రెండో పార్ట్ కథపై ఇంకాస్త ఎక్కువ కసరత్తులు చేస్తున్నారట. ఓ స్పెషల్ టీమ్ ఈ స్క్రిప్ట్ వర్క్‌లో పని చేస్తోందట. శౌర్యంగ వంశానికి చెందిన దేవాకీ, వరద రాజ మన్నార్‌కి మధ్య రాజకీయ పోరు ఎలా వుండబోతుందో ‘సలార్ 2’లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.
అలాగే, రాధా రమగా శ్రియా రెడ్డి పాత్రనీ, ఆమె భర్త బాబీ సింహా పాత్ర కూడా అత్యంత శక్తివంతంగా తీర్చి దిద్దబోతున్నారట. మొదటి పార్ట్‌లోని కొన్ని కొన్ని లోపాలను రెండో పార్ట్‌లో సవరించేందుకు ఎక్కువ టైమ్ తీసుకోబోతున్నారనీ తెలుస్తోంది. ఏది ఏమైనా ‘సలార్’ మొదటి పార్ట్‌కి వచ్చిన కాస్తో కూస్తో హైప్‌తో రెండో పార్ట్‌పై అంచనాలకు మించకుండా హార్డ్ వర్క్ చేయాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ భావిస్తోందట.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







