అయోధ్య రామాలయం.! ఆ ముగ్గురికీ అరుదైన గౌరవం.!

- January 23, 2024 , by Maagulf
అయోధ్య రామాలయం.! ఆ ముగ్గురికీ అరుదైన గౌరవం.!

500 ఏళ్ల హిందువుల నిరీక్షణ. జనవరి 22న నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. హిందువులందరికీ ఈ రోజు ఎంతో గర్వించదగ్గ రోజు.

అలాగే, సౌత్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఈ అపురూపమైన ఘట్టంలో అరుదైన గౌరవం దక్కింది. వాళ్లే మెగా ప్యామిలీ. మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ చెందిన బిగ్ సెలబ్రిటీ. అలాగే, కేంద్ర మంత్రిగా పని చేశారు. పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆయన తనదైన గుర్తింపు దక్కించుకున్నారు.

ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ మరొకరు. పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిరానికి 30 లక్షల విరాళంగా ఇచ్చారు. ఇక మూడో వ్యక్తి మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ పోషించిన పాత్రను నార్త్‌లో శ్రీరాముడి పాత్రతో పోల్చి చూశారు. అపురూపమైన ఆదరణ దక్కింది రామ్ చరణ్‌కి ఆ పాత్రతో. అలా ఆయనకు ఈ అపురూపమైన ఘట్టంలో స్థానం దక్కింది.

ఇలా ఈ ముగ్గురూ రామ మందిరం ప్రారంభోత్సవం రోజు అయోధ్యలో అడుగు పెట్టడంతో తమ జన్మ ధన్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. నిజమే.! ఈ అపూర్వ ఘట్టానికి సంబంధించి మాటలు వర్ణనాతీతం.

అయితే, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అయోధ్యలో కలిసినట్లుగా సమాచారం లేదు. విడి విడిగానే కనిపించారు. ఒకవేళ కలిసినా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఎక్కడా రివీల్ కాకపోవడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com