ఒమన్‌లో జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవం
- January 23, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఒమన్ సుల్తానేట్ స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో విద్య యొక్క పాత్రను ప్రశంసిస్తూ ఏటా జనవరి 24న ప్రపంచ విద్యా దినోత్సవాన్ని విద్యా మంత్రిత్వ శాఖ జరుపుకుంటుంది. అన్ని స్థాయిలలో విద్యా రంగంపై శ్రద్ధ పెట్టడం, శాస్త్రీయ పరిశోధన మరియు ఆవిష్కరణలకు సహాయక వాతావరణాన్ని అందించడం తమ ప్రాధాన్యతలలో అగ్రస్థానంలో ఉంటుందని మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అనేక సందర్భాల్లో తెలిపారు. దీనికి అనుగుణంగా ఒమన్ సుల్తానేట్ విద్యార్థులలో సహనం, శాంతి విలువలను పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది "శాశ్వత శాంతి కోసం విద్య" అనే థీమ్‌తో అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







