శ్రీవారి భక్తులకు అలెర్ట్..
- January 23, 2024
తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు చెప్పింది. ఏప్రిల్-2024 మాసానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
అలాగే తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు విషయాన్ని గ్రహించి.. http://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో ముందస్తుగా దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. అలాగే, తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









