నాలుగేళ్ల తర్వాత BCCI అట్టహాసంగా అవార్డుల వేడుక

- January 23, 2024 , by Maagulf
నాలుగేళ్ల తర్వాత BCCI అట్టహాసంగా అవార్డుల వేడుక

హైదరాబాద్‌: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వార్షిక అవార్డుల కార్యక్రమం ఈరోజు అంటే మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్‌లో మహ్మద్ షమీ, శుభమన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు.

ఈ ఆటగాళ్లు 2019 నుండి 2023 వరకు సంవత్సరపు అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. ప్రతి నాలుగేళ్లకోసారి బీసీసీఐ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. దీనికి ముందు, ఈ వేడుక చివరిగా 2019 లో జరిగింది.

అవార్డులు అందుకున్న వారు

  • శుభ్‌మన్ గిల్- క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (2022-23)
  • జస్ప్రీత్ బుమ్రా- క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (2021-22)
  • రవిచంద్రన్ అశ్విన్- క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (2020-21)
  • మహ్మద్ షమీ- క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (2019-20)
  • రవిశాస్త్రి- సికె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • ఫరూక్ ఇంజనీర్- సికె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- యశస్వి జైస్వాల్ (2022-23)
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- శ్రేయాస్ అయ్యర్ (2021-22)
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- అక్షర్ పటేల్ (2020-21)
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- మయాంక్ అగర్వాల్ (2019-20)
  • దిలీప్ సర్దేశాయ్ అవార్డు- రవిచంద్రన్ అశ్విన్ (టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు, 2022-23)
  • దిలీప్ సర్దేశాయ్ అవార్డు-యశస్వి జైస్వాల్ (టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, 2022-23)
  • లాలా అమర్‌నాథ్ అవార్డు (దేశీయ క్రికెట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనకు)-బాబా అపరాజిత్, రిషి ధావన్, రియాన్ పరాగ్
  • లాలా అమర్‌నాథ్ అవార్డు (రంజీ ట్రోఫీలో ఆల్ రౌండ్ ప్రదర్శనకు)-ఎంబీ మురాసింగ్, షామ్స్ ములానీ, సరాంశ్ జైన్
  • మాధవరావు సింధియా అవార్డు( రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్)- జయదేవ్ ఉనద్కత్, షామ్స్ ములానీ, జలజ్ సక్సేనా
  • మాధవరావు సింధియా అవార్డు (రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్) - రాహుల్ దలాల్, సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్                       ఈ మహిళా క్రీడాకారిణులు కూడా అవార్డులు అందుకున్నారు
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- ప్రియా పునియా (2019-20)
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- షెఫాలీ వర్మ (2020-21)
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- సబ్బినేని మేఘన (2021-22)
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- అమంజోత్ కౌర్ (2022-23)
  • ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు)- దీప్తి శర్మ (2019-20 & 2022-23)
  • ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు)- స్మృతి మంధాన (2020-21 & 2021-22)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com