కెనడాలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
- January 24, 2024
ఒట్టావా: కెనడా కార్మికులతో వెళ్తున్న ఓ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నార్త్‌వెస్ట్ టెరిటరీస్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పోర్ట్‌స్మిత్ నుంచి కార్మికులతో రియో టింటో మైనింగ్ సంస్థకు చెందిన దియావిక్ వజ్రాల గని వద్దకు ఆ విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో దానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కుప్పకూలిపోయినట్లు అధికారులు తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







