సుహాస్ ‘అంబాజీపేట బ్యాండ్’.! సౌండ్ అదిరింది.!
- January 24, 2024
కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నటుడు సుహాస్.. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగానూ సత్తా చాటాడు. చాలా మంది కమెడియన్లు హీరోలుగా మారి తమ కెరీర్‌ని గందరగోళంలో నెట్టేసుకున్న సంగతి తెలిసిందే.
కానీ, సుహాస్ అలా కాదు. ఓ పక్క తనకు గుర్తింపు తెచ్చిన కమెడియన్ స్టేటస్ అలాగే వుంచుకున్నాడు. దాంతో పాటూ, విభిన్న తరహా కథల్లో లీడ్ రోల్స్ పోషిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఇటీవల ‘రైటర్ పద్మభూషన్’ సినిమాతో సుహాస్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. తాజాగా మరో విభిన్న మూవీతో వస్తున్నాడు. అదే ‘అంబాజీ పేట బ్యాండ్’. ఈ సినిమాలో మంగలి పాత్రలో సుహాస్ నటిస్తున్నాడు.
ఓ వైపు వినోదం పంచుతూనే మరోవైపు ఓ సీరియస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏదో చెప్పబోతున్నాడు ఈ సినిమాతో. లేటెస్ట్గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తనదైన బేస్ వాయిస్‌తో సుహాస్ పలుకుతున్న డైలాగులు ఎప్పటిలాగే ఈ సినిమాకీ ప్లస్ కానున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.
ఫిబ్రవరిలో ‘అంబాజీపేట బ్యాండ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









