హెబ్బా పటేల్ అక్కడ అలా.! ఇక్కడ ఇలా.!
- January 24, 2024
‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ తదితర చిత్రాల్లో నటించింది. తాను డెబ్యూ చేసిన హీరో రాజ్ తరుణ్‌తోనే దాదాపు మూడు నాలుగు సినిమాల్లో నటించేసిందీ ముద్దుగుమ్మ.
అయితే, వెండితెరపై హెబ్బా పటేల్‌కి గ్లామర్ ఎక్కువ వున్న పాత్రలే దక్కాయ్. పర్‌ఫామెన్స్‌కి చోటున్నప్పటికీ ఆమె గ్లామర్ మాత్రమే హైలైట్ అవుతూ వచ్చింది.
కానీ, ఓటీటీలో హెబ్బా పటేల్ పూర్తిగా భిన్నం. ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి సినిమాలే కాదు, మరి కొన్ని వెబ్ సిరీస్‌లలో హబ్బా పటేల్ మేకోవర్.. చూపించిన నటనా ప్రతిభ వావ్ అనిపిస్తాయ్.
తాజాగా వెండితెరపై మరోసారి హెబ్బా పటేల్ సందడి చేయబోతోంది. అదే ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో. ఈ సినిమా ప్రోమోస్ చూస్తుంటే.. ఇందులోనూ హెబ్బా పటేల్‌ని గ్లామర్ కోసమే వాడినట్లు కనిపిస్తోంది.
హీరో చైతన్య రావుతో హెబ్బా పటేల్ చేస్తున్న రొమాన్స్ కుర్రకారుకు హీట్ పెంచేస్తోంది. ఓటీటీలో మంచి స్కోపున్న క్యారెక్టర్లు దక్కించుకుంటున్న హెబ్బా పటేల్‌కి పెద్ద తెరపై ఎందుకు అలాంటి పాత్రలు దక్కడం లేదు. మేకర్లు దృష్టిలోనే ఏదో దృష్టి లోపం వుందేమో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







