స్కిల్ ట్రైనింగ్ ద్వారా నిరుపేద యువతకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సాధికారత
- January 24, 2024
హైదరాబాద్: జీఎంఆర్ గ్రూప్ యొక్క సిఎస్ఆర్ విభాగమైన జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ (GMRVF) ఇండస్ట్రీ లీడర్లుగా ఉన్న కంపెనీలు సహకారంతో, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా యువతకు సాధికారత కల్పించడంలో, ఉత్తమ శిక్షణను అందిస్తూ కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్ మద్దతును అందించడంలో ముందంజలో ఉంది. వోల్టాస్, ష్నీడర్, వోల్వో, టివిఎస్, సెయింట్ గోబెన్ - జిప్రోక్, హెచ్ఎంఎస్ హోస్ట్, సింగర్ మరియు రైటర్స్ వంటి పరిశ్రమ భాగస్వాములు విద్యార్థుల నైపుణ్యాలను రూపొందించడంలో సహకారాన్ని అందిస్తారు.
శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ క్యాంపస్ లో ఉన్న స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రస్తుతం పాఠశాల, కళాశాల డ్రాపవుట్లకు తొమ్మిది విభిన్న కోర్సులను అందిస్తోంది, ఇవన్నీ నిరుద్యోగ యువతకు ఉచితం. పురుషులకు, ఆహారం మరియు వసతితో సహా శిక్షణ అందించబడుతుంది, మహిళలకు రవాణా మరియు భోజన సౌకర్యాలతో డే కోర్సులను అందిస్తుంది. ఏసీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఆటోమొబైల్ రిపేర్, ఎక్స్కవేటర్ ఆపరేటర్, డ్రై వాల్స్ అండ్ ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్, వెల్డర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులను 3 నెలల కోర్సుగా, టైలరింగ్ కోర్సును 2 నెలల కోర్సుగా అందిస్తున్నారు.
ప్రవేశ ప్రమాణాలలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) కుటుంబానికి చెందినవారు మరియు ఎస్ఎస్సి ఫెయిల్ లేదా ఉత్తీర్ణత యొక్క కనీస అర్హత కలిగి ఉండాలి. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు తప్పనిసరిగా ఎస్ఎస్సీ ఉత్తీర్ణత అవసరం.
ఇప్పటి వరకు, జీఎంఆర్ వీ ఎఫ్ 17,000 మందికి పైగా అభ్యర్థులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చింది, 90% ప్లేస్మెంట్ సపోర్ట్ను కలిగి ఉంది. టెక్నికల్ ట్రైనింగ్ తో పాటు, పాల్గొనే వారందరికీ స్పోకెన్ ఇంగ్లిష్ మరియు సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కు జీఎంఆర్ వీ ఎఫ్ ప్రాధాన్యత ఇస్తుంది.
వివిధ కోర్సుల్లో పరిమిత సీట్లు అందుబాటులో ఉండటంతో కొత్త బ్యాచ్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలకు ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు 8985800102 నంబర్ పై సంప్రదించాలని సూచించారు. ఒకేషనల్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 26 జనవరి 2024.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







