హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
- January 25, 2024
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఖర్గే హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ కేడర్‌కు ఖర్గే దిశా నిర్దేశనం చేయనున్నారు. ఈ సమావేశంలో ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, నాయకులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









