రాముడు రాముడే భీముడు భీముడే.!
- January 25, 2024
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎన్టీయార్ పాత్రను తగ్గించేశారంటూ.. అప్పట్లోనే గొడవలు వినిపించాయ్. ఎన్టీయార్ ఫ్యాన్స్ ఈ గొడవకు తెర లేపారు.. అయితే, ఎలాగోలా అప్పట్లో ఈ గొడవ సద్దుమనిగిందనుకోండి.
తాజాగా ఇంకోసారి ఇదే రచ్చ మళ్లీ చర్చకొచ్చింది. అందుకు కారణం పెద్దాయన విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు. రామ్ చరణ్ పాత్రలో అనేక రకాల వేరియేషన్స్ వుంటాయ్. ఆ పాత్రకు ఎన్టీయార్ పాత్ర తోడు కావడంతో మరింత ఎలివేట్ అయ్యింది.. అని క్యాజువల్‌గా ఆయన మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురయ్యాయ్.
అదిగో కావాలనే ఎన్టీయార్ పాత్రను తగ్గించేశారంటూ.. కొందరు ఆయన మాటల్ని తప్పు పడుతున్నారు. దర్శకుడు రాజమౌళిని సైతం హెచ్చరిస్తున్నారు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి రాముడి పాత్ర అయిన రామ్ చరణ్, భీముడి పాత్ర అయిన ఎన్టీయార్.. ఇద్దరూ మాకు సమానమే.. అని ఆ రెండు పాత్రల్ని ఈక్వెల్‌గా బ్యాలెన్స్ చేస్తూనే సినిమా తెరకెక్కించామంటూ రాజమౌళి మళ్లీ మళ్లీ వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయినా ఎప్పటికప్పుడే నీటిలో నిప్పులా ఈ చిచ్చు రాజుకుంటూనే వుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







