‘ఈగల్’ పరిస్థితి ఇలా అయ్యిందేంటబ్బా.!
- January 25, 2024
సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సినిమాల్లో ‘ఈగల్’ ఒకటి. సోలో రిలీజ్ అనే ఒప్పందంతో నిర్మాతల మండలి ఇచ్చిన వాగ్థానంతో సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకుంది.
ఫిబ్రవరి 9న గ్రాండ్‌గా సోలో రిలీజ్‌కి సిద్ధమైంది. అయితే, సందట్లో సడేమియా అన్నట్లుగా ఇదే డేట్‌కి సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా లైన్లోకి వచ్చింది.
మామూలుగా అయితే, సందీప్ కిషన్‌ని పెద్దగా పట్టించుకోరు. కానీ, ఈ సినిమా ప్రోమోలు ఆసక్తికరంగా వుండడం.. రెస్పాన్స్ హ్యూజ్ రేంజ్లో వస్తుండడంతో ‘ఈగల్’ నిర్మాతలు ఈగో ఫీలవుతున్నారట.
ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసుకోవాలని వాదనకు దిగుతున్నారట. అయితే, ‘భైరవకోన’ మేకర్లు సైతం వెనక్కి తగ్గేలా లేరంటున్నారు.
ముందుగానే ఈ డేట్‌ని మేం లాక్ చేసుకున్నాం. సో మేం తగ్గేదే లే.! అంటున్నారట. ఇలా ఈగల్, భైరవకోన మేకర్ల మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. చూడాలి మరి, ఎవరైనా తగ్గుతారా.? లేదంటే.. నువ్వా నేనా.? అని బాక్సాఫీస్ వద్ద పోటీ పడతారా.?
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







