ఇలియరాజా ఇంట విషాదం.. ఆయన కుమార్తె మృతి..
- January 25, 2024
సంగీత స్వరకర్త ఇళయరాజా కుమార్తె భవథరణి (47) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే.. ఆమె ఇటీవల వైద్యం కోసం శ్రీలంకకు వెళ్లారు.
5 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం 5:20 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె తమిళంలో గాయనిగా అరంగేట్రం చేసింది. ఆమె తన సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీతంలో కూడా చాలా పాటలు పాడారు. ముఖ్యంగా, భారతి చిత్రంలో మయిల్ పోలా పొన్ను ఒన్ను పాట పాడినందుకు ఆమె జాతీయ అవార్డును గెలుచుకుంది. భవథరణి మృతదేహాన్ని రేపు భారత్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







