గుండె వేగంగా కొట్టుకోవడం దేనికి సంకేతం.?

- January 25, 2024 , by Maagulf
గుండె వేగంగా కొట్టుకోవడం దేనికి సంకేతం.?

చలికాలంలో కొందరికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయితే ఇది సాధారణ సమస్యనేనా.? లేదంటే ఏదైనా అనారోగ్యానికి దారి తీస్తుందా.? అంటే.. కొందరిలో ఒత్తిడి, టెన్షన్.. రకరకాల కారణాల వల్ల రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి.. బీపీ పెరుగుతుంది.
తద్వారా గుండె వేగం కూడా పెరుగుతుంది. సాధారణంగా అయితే, దీన్ని ఒక మానసిక సమస్యగా పరిగణిస్తారు. కానీ దీర్ఘ కాలం పాటు ఇదే సమస్య కొనసాగితే మాత్రం వైద్యుని సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల కూడా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దాంతో బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. అప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అయితే, హార్ట్ బీట్ పెరగడం అనేది కొన్నిసార్లు గుండెకి సంబంధించిన సమస్య కాదు.. మెదడుకు సంబంధించిన సమస్యగా కూడా పరిగణిస్తారు.
ఇలాంటప్పుడు మెదడును కూల్ చేసేలా పనులు చేయాలి. వీలైతే వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. లేదంటే ఇష్టమైన వ్యక్తులతో మాట్టాడడం చేయాలి.
తద్వారా కొంత మనసు తేలీక పడుతుంది. మొక్కలు పెంచడం, ప్రశాంతమైన వాతావరణంలో నచ్చిన పనిని చేసుకోవడం వంటివి చేసినా కాస్త ఊరట లభిస్తుంది. సరదాగా వంట చేయడం.. లేదంటే, ఏదైనా ఆహ్లాదమైన వస్తువులతో టైమ్ పాస్ చేయడం వంటివి కూడా ఈ సమస్యకు ఊరటనిస్తాయని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com