పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..
- January 25, 2024
న్యూ ఢిల్లీ: భారతదేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన పద్మా అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 34 మందికి ఈ పురస్కారాలను ప్రకటించిగా.. అందులో ఐదుగురు తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం.
పద్మ విభూషణ్!
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి.
పద్మ శ్రీ వీరికే..
తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిలను ఈ అవార్డులు వరించాయి.
సాంప్రదాయకంగా పురుషాధిక్య రంగంలో తనకంటూ ఒక స్థలాన్ని సృష్టించుకోవడానికి మూస పద్ధతులను అధిగమించిన భారతదేశపు తొలి మహిళా ఏనుగు మహోట్ పార్బతి బారుకు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రకటించారు. అలాగే.. కళలు విభాగంలో బిహార్‌కు చెందిన భార్యాభర్తలు శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్‌కు.. త్రిపురకు చెందిన చక్మా రేఖాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







