రిపబ్లిక్ డే స్పెషల్..వినూత్నంగా గూగుల్ డూడుల్
- January 26, 2024
న్యూ ఢిల్లీ: భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్ వినూత్నంగా డూడుల్‌ని ప్రదర్శించింది. దశాబ్దాలుగా ప్రదర్శిస్తున్న ఈ డూడుల్ వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంటోంది. భారత ఖ్యాతిని చాటి చెప్పేలా శుక్రవారం ప్రదర్శించిన డూడుల్‌లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీలు, మొబైల్ ఉన్నాయి. కళాకారిని బృందా జవేరి రిపబ్లిక్ డే పరేడ్‌ను వేర్వేరు స్క్రీన్‌లపై కనిపించేలా ఇందులో ఉంచారు. గుజరాత్‌కు చెందిన కళాకారుడు పార్త్ కొతేకర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గతేడాది గూగుల్ డూడుల్‌ను వివరించడానికి చేతితో కత్తిరించిన పేపర్ ఆర్ట్‌వర్క్‌ను రూపొందించారు.
దేశ ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లోని రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కవాతు బృందం, మోటార్ సైకిల్ రైడర్‌లతో సహా కళాకృతికి ఆ డూడుల్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య మార్గ్‌లో నిర్వహించే సైనికుల కవాతులు ఆకట్టుకుంటుంది. ఉత్సవాల ముగింపు కోసం జనవరి 29న బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







