జాతీయ జెండాను ఆవిష్కరించిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్
- January 26, 2024
హైదరాబాద్: హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కేంద్ర కార్యాలయం బస్ భవన్‌లో శుక్రవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం టీఎస్‌ఆర్టీసీని ఆదరిస్తోన్న ప్రజలకు, సంస్థ అభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న సిబ్బందికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శుభదినాన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహానీయుడిని స్మరించుకోవాలన్నారు.
ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. దేశానికే గర్వకారణమైన జనగణమన జాతీయ గీత ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు వివరించడంతో పాటు నేటి తరంలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు బస్ భవన్ లో జాతీయ గీతలాపన చేస్తున్నామని చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ మహోత్తర కార్యక్రమాన్ని జోన్, ఆర్ఎం కార్యాలయాలతో పాటు డిపోలకు విస్తరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు.
మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లో సమర్థవంతంగా సంస్థ అమలు చేసిందని గుర్తు చేశారు. సంస్థకు చెందిన 7200 పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహాలక్ష్మి స్కీం విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పడానికి తనకెంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని, ఈ స్కీమ్ ను ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్దతతో పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైతుందన్నారు.
మహాలక్ష్మి స్కీమును ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా అమలుచేస్తున్నారని సంస్థ అధికారులను, సిబ్బందిని ప్రభుత్వం మెచ్చుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలియజేశారన్నారు.
“పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే 1325 డీజిల్, మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తోంది. ఈ 2375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోంది. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్ మెంట్ ను చేపడుతాం. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్ లో వారికి అపాయిట్మెంట్ లెటర్లను అందజేస్తారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారు.” అని సజ్జనర్ తెలిపారు.
టీఎస్ఆర్టీసీ సిబ్బంది పెండింగ్ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ ఛాలెంజ్ ను తీసుకువచ్చిన అధికారులు, సిబ్బంది విజయవంతం చేస్తున్నారని, ఛాలెంజ్ కు తగ్గట్టుగా పనిచేస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా సంక్రాంతికి సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేశారని, ఇన్సిడెంట్ ఫ్రీగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, అదే స్పూర్తితో, ఉత్సాహంతో రాబోయే మేడారం జాతరకు పనిచేయాలన్నారు.
ఈ గణంతంత్ర వేడుకల్లో విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగ అధికారులకు మెడల్స్ తో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సత్కరించారు.సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాల్లో అత్యధిక యూనిట్లు సేకరించిన హకీంపేట, చెంగిచర్ల, కంటోన్మెంట్ డిపో మేనేజర్లను ప్రశంసా పత్రాలతో సన్మానించారు.
ఈ గణతంత్ర వేడుకల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు మునిశేఖర్, కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వజర్ విజయ పుష్ఫ, సీపీఎం ఉషాదేవి, తార్నాక ఆస్పత్రి ఓఎస్డీ డాక్టర్ సైది రెడ్డి, సీటీఎం జీవన ప్రసాద్, సీసీఓఎస్ విజయభాస్కర్, సీఈఐటీ రాజశేఖర్, సీటీఎం కమర్షియల్ సుదర్శన్, సీసీఈ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







