విజిట్ ఖతార్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం
- January 26, 2024
దోహా: 10 రోజుల విజిట్ ఖతార్ కైట్ ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది. పాత దోహా పోర్ట్‌లోని గ్రాండ్ క్రూయిజ్ టెర్మినల్ అందమైన కాన్వాస్‌గా మారింది. ఆక్టోపస్‌ల నుండి సింహాల వరకు, చూపరుల ఊహలను ఆకర్షిస్తూ రూపొందిన విచిత్రమైన కైట్స్ ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 3 వరకు సాగే ఈ ఫెస్టివల్ వారాంతపు రోజులలో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, వారాంతాల్లో (శుక్రవారం, శనివారం) ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం వేదికను మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ పార్క్ నుండి ఓల్డ్ దోహా పోర్ట్‌కు మార్చారు. ప్రపంచం నలుమూలల నుండి 60 మందికి పైగా పాల్గొన్నారు. ఫెస్టివల్ లో కుటుంబాలు మరియు పిల్లలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆహార కియోస్క్‌లు, బండ్ల వద్ద భారీ రంగురంగుల గాలిపటాలు, అంతర్జాతీయ వంటకాలను సందర్శకులు ఆస్వాదించారు. పిల్లల కోసం పెయింట్ చేయడం నేర్పించే వర్క్‌షాప్‌లు, గాలిపటాల తయారీని నేర్పించే వర్క షాప్ లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ వర్క్‌షాప్‌లో యువ ఔత్సాహికులకు 1,000 ఉచిత గాలిపటాలను కూడా అందించనున్నారు. నమోదు చేసుకోవడానికి, http://vqikf.comని సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







