అబుధాబి-అల్ ధన్నా మధ్య ప్యాసింజర్ రైలు ప్రారంభం
- January 26, 2024
యూఏఈ: అబుధాబి మరియు అల్ ధన్నా నగరాలను కలుపుతూ ఎతిహాద్ రైలు తన మొదటి రైలు ప్రయాణాన్ని గురువారం ప్రారంభించింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నోక్) మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ సీఈఓ డాక్టర్ సుల్తాన్ బిన్ అహ్మద్ అల్ జాబర్, అడ్నాక్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్ సభ్యులు మొదటి రైడ్ లో పాల్గొన్నారు. అనంతరం వారు డాక్టర్ అల్ జాబర్ అల్ రువైస్ ఇండస్ట్రియల్ సిటీలోని అడ్నోక్ మరియు పెట్రోకెమికల్స్ హబ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ మాట్లాడుతూ.. యూఏఈ అభివృద్ధికి మరియు భవిష్యత్తు శ్రేయస్సుకు దోహదపడే రవాణా పరిష్కారాలను విజయవంతంగా అమలు చేయడానికి ఎతిహాద్ రైల్‌తో అడ్నోక్ భాగస్వామ్యం తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలతో ఒకటన్నారు. తమ నాయకత్వం యొక్క దార్శనిక ఆదేశాలకు అనుగుణంగా తిహాద్ రైల్ ఛైర్మన్ షేక్ థెయాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పర్యవేక్షణలో అబుదాబి సిటీ - అల్ ధన్నా సిటీల మధ్య ప్యాసింజర్ రైలు సేవల అభివృద్ధి యూఏఈ యొక్క ప్రధాన వాణిజ్య కేంద్రాలను అనుసంధానించే లక్ష్యంతో చేపట్టిందన్నారు. ముఖ్యంగా పరిశ్రమ, తయారీ, ఉత్పత్తి, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







