ఇద్దరు ‘పద్మవిభూషణులు’ ఒకేచోట..
- January 27, 2024
న్యూ ఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులని నిన్న సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. దీంట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ని ప్రకటించారు. తెలుగు సీనియర్ రాజకీయ నాయకులు వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు.
దీంతో నిన్న రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి, వెంకయ్యనాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు పర్సనల్ గా కలిసి సత్కరిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ ఇద్దరు పద్మ విభూషణులు ఒకేచోట చేరారు. మెగాస్టార్ చిరంజీవి నేడు సాయంత్రం వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు.
చిరంజీవి, వెంకయ్యనాయుడు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. సంతోషకరమైన క్షణాలను వెంకయ్యనాయుడు గారితో పంచుకున్నాను. ప్రతిష్టాత్మకమైన గౌరవం అందుకున్నందుకు తోటి గ్రహీతలుగా ఒకరినొకరు అభినందించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. దీంతో ఇద్దరు పద్మ విభూషణులు, తెలుగు వారికి గర్వకారణమైన ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫొటోలో ఉన్నారు అంటూ అభినందనలు కురిపిస్తూ ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







