వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణి
- January 27, 2024
యూఏఈ: దుబాయ్ లోని కరమా పార్క్ లో గణంత్ర దినోత్సవం సందర్భంగా కారమా ప్రాంతంలో ఉన్న ప్రవాసాంధ్రలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కరామా వైఎస్సార్సీపీ నాయకులు ప్రేమ్,యాడ్ర శ్రీనివాస్,శేఖర్, తాడి రమేష్,సతీష్, నాగరాజు,అనిల్,షేక్ చిన్ని, శ్రీలక్ష్మి,దడాల సీతా నేతృత్వంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కడప యువ నాయకులు షేక్ ఉమైర్ హాజరు అయ్యారు.ఈ సంద్భంగా ఉమైర్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు రానున్న ఎన్నికల దృష్ట్యా దిశ నిర్దేశం చేసారు.ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వీడిన సమయంలో ప్రజలే తన సైన్యమని భావించి ధైర్యంగా అడుగు ముందుకేసిన జగనన్న.
ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలకు తనొక్కడై సైన్యమై నిలిచారని, ప్రతి పనిలోనూ తోడుగా .. ఆపదొస్తే కొండంత అండగా ఉన్నారని ఆయన సారధ్యంలో కార్యకర్తలుగా పని చేయడం మనందరికీ గర్వకారణమని తెలిపారు.
ఇడుపుల పాయ మొదలు...ఇచ్చాఫురం దాకా చేపట్టిన ‘ప్రజా సంకల్ప’ యాత్రలో అందరి నాయకుల్లా కళ్లతో కాకుండ మనసుతో ప్రజల కష్టాల్ని దగ్గరుండి చూశారు. అందుకే అధికారంలోకి వచ్చినరోజు నుంచి ప్రజల కష్టాల్ని శాశ్వతంగా తుడవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ప్రజల మనసుల్లో మనసున్న సీఎంగా నిలిచిపోయారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా సంక్షేమాన్ని పరవళ్లు తొక్కించారని ఆయన తెలిపారు.
ఈ రోజు విద్యా, వైద్యం.. సంక్షేమం.. అభివృద్ధి..ఏ రంగంలో చూసినా.. ఏపీ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉంది.కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు.
సంక్షేమ సారథి ఆయన మన ముఖ్యమంత్రి ని ఎదురించెందుకు ప్రతిపక్షాలు అందరూ కలిసి ఒక్కటిగా జట్టు గట్టరని , ఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేందుకు మనమందరం సర్వ శక్తులు ఒడ్డి కృషి చేయాలని, ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి చెప్పినట్టు పేదలకి పెత్తొందారలకి మధ్య యుద్ధంగానే చూడాలి అని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్నికలు ముగిసే దాకా ఉధృతంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి గడపకి చేరవేసే భాధ్యత మన అందరం తీసుకొని తీరాలి అని ఆయన దిశ నిర్దేశం చేశారు. జగన్ అన్న కోసం సైనికుడిగా తన శక్తి మొత్తం పెట్టి పోరాడేందుకు తాను సిద్ధం ...మరి మీరు సిద్దమా అని ఉమైర్ పార్టీ అభిమానులని సమరోత్సహులును చేసారు.
ఈ సందర్భంగా యూఏఈ వైఎస్సార్సీపీ కన్వీనర్ సయీద్ అక్రం మాట్లాడుతూ మరో సారి జగన్ అన్న మన అందరికోసం రావాలని అందుకోసం అందరం ఒక్కటిగా ప్రభుత్వ గళాన్ని గట్టిగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించి ఎవరికి కష్టం వచ్చిన సత్వరమే స్పందించి ప్రభుత్వ క్యాతిని ఎంతగానో పెంచుతున్న APNRTS చైర్మన్ మేడపాటి వెంకట్, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ కి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూఏఈ విభాగం కన్వీనర్ సయ్యిద్ అక్రం, సభ్యులు జాఫర్ అలి ,ఖాజా అబ్దుల్ ముతాలిబ్, విజయ భాస్కర రెడ్డి,ఫహీం,అబ్దుల్లా, చక్రి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







