వెంకన్నను దర్శించుకున్న సెలెబ్రిటీలు

- May 31, 2016 , by Maagulf
వెంకన్నను దర్శించుకున్న సెలెబ్రిటీలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, భార్య అంజలి టెండుల్కర్ తిరుమల చేరుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.
అక్కడ నుంచి సచిన్, తన భార్యతో కలిసి కారులో ముందుగా తిరుమల బయల్దేరి వెళ్లారు. అనంతరం హీరో నాగార్జున, ఇతరులు మరో వాహనంలో వెళ్లారు. బుధవారం వేకువజామున వీరంతా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. కాగా నాగార్జున గడ్డం పెంచి కొత్త లుక్ లో కనిపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com