అంతర్జాతీయ న్యాయస్థానం తీర్మానాలను స్వాగతించిన ఒమన్
- January 27, 2024
మస్కట్: ఇజ్రాయెల్ ఆక్రమిత రాజ్యానికి వ్యతిరేకంగా రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా దాఖలు చేసిన వ్యాజ్యానికి సంబంధించి హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) తీర్మానాలను ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజా స్ట్రిప్ మరియు మిగిలిన ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ దురాక్రమణలను తక్షణమే ఆపవలసిన అవసరాన్ని తెలిపిందన్నారు. గాజాపై విధించిన ముట్టడిని ఎత్తివేయాల్సిన అవసరాన్ని కూడా ఇది చెప్పిందని పేర్కొంది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలు, మారణహోమ చర్యలను నిలిపివేయడానికి ఇజ్రాయెల్ ను నియంత్రించాలని అంతర్జాతీయ సమాజానికి ఒమన్ పిలుపునిచ్చింది. మానవ హక్కులు మరియు న్యాయం , న్యాయస్థానం ముందు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన రిపబ్లిక్ ఆఫ్ దక్షిణాఫ్రికాకు ఒమన్ కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







